శంషాబాద్, వెలుగు: సింగపూర్ నుంచి శంషాబాద్ వస్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. ఎయిర్పోర్ట్ భద్రతా దళాలకు ఆదివారం ఈ సమాచారం అందడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చడంతో అంతా ఊపిరి
పీల్చుకున్నారు.
