టీశాట్ నుంచి బోనాల సాంగ్ విడుదల

టీశాట్ నుంచి బోనాల సాంగ్ విడుదల

హైదరాబాద్, వెలుగు: విద్యార్థులు, ఉద్యోగార్థులకు స్పెషల్​ లైవ్​క్లాసులు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్న టీశాట్​..తాజాగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాలపై ప్రత్యేక సాంగ్ ను విడుదల చేసింది. బుధవారం టీశాట్ ఆఫీసులో సిబ్బంది, పాటల రచయితల సమక్షంలో బోనాల సాంగ్ ను టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి విడుదల చేశారు. 

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మరింత విస్తరింపజేసేందుకు టీశాట్ నెట్ వర్క్ కృషి చేస్తుందని బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మట్టిలో మణిక్యాల్లాంటి కవులు, కళాకారులు, గాయకులను గుర్తించి వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు టీశాట్ వేదికగా నిలుస్తుందన్నారు. ఆషాఢ బోనాలపై పాటను రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పాటల రచయితలు, బృందాన్ని సన్మానించారు.