నేను బీజేపీ నుంచి పోటీ చేస్తాననే ప్రచారం అవాస్తవం : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

నేను బీజేపీ నుంచి పోటీ  చేస్తాననే ప్రచారం అవాస్తవం : మాజీ మేయర్  బొంతు రామ్మోహన్
  • మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ నుంచి తాను పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. గురువారం మీడియాకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

బీజేపీ తరఫున నేను పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం  లేదు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అభ్యర్థి ఎవరనే దానిపై బీజేపీలో జరుగుతున్న చర్చలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ప్రస్తుతం కాంగ్రెస్‌‌లో పూర్తి సంతృప్తిగా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈ పార్టీలోనే కొనసాగుతాను" అని స్పష్టం చేశారు.