తిరుమలలో గది కావాలంటే.. బుకింగ్ ఈజీ

తిరుమలలో గది కావాలంటే.. బుకింగ్ ఈజీ
  • ఆరు చోట్ల గదుల బుకింగ్ కేంద్రాలు
  • పేర్లు నమోదు చేసుకుంటే ఫోన్లకు మెసేజ్
  • ఫోన్ కు మెసేజ్ వచ్చిన వెంటనే డబ్బు చెల్లిస్తే గది కేటాయింపు
  • ఈనెల 12 నుంచి కొత్త విధానం

తిరుపతి: తిరుమల కొండపై గదుల కేటాయింపును మరింత సులభతరం చేశారు. తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో వసతి గదుల కోసం గ‌దుల కొర‌కు పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకునే అవ‌కాశాన్ని టిటిడి క‌ల్పిస్తోంది. ఈనెల 12వ తేదీ నుండి భ‌క్తుల‌కు మ‌రింత సుల‌భంగా వ‌స‌తి గ‌దుల కేటాయింపు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 12వ తేదీ శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల నుండి తిరుమ‌ల‌లోని ఆరు ప్రాంతాల్లో నూత‌నంగా టిటిడి ఏర్పాటు చేసిన కౌంట‌ర్ల‌లో వ‌స‌తి బుకింగ్ విధానం ప్రారంభం అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల‌లో వసతి గది కావాలంటే సిఆర్‌వో వ‌ద్ద పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకుంటే గ‌దులు కేటాయిస్తున్న విష‌యం తెలిసిందే.ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ టీటీడీ ఏర్పాట్లు చేసింది.

గదుల బుకింగ్ ఎక్కడెక్కడంటే 
జిఎన్‌సి టోల్‌గేట్ వ‌ద్ద ఉన్న ల‌గేజి కౌంట‌ర్ వద్ద  రెండు కౌంట‌ర్లు
బాలాజి మెయిన్ బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు
కౌస్తుభం అతిథి భ‌వ‌నం వ‌ద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంట‌ర్లు
రాంభ‌గిచ బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు
ఎమ్‌బిసి ప్రాంతంలోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద రెండు కౌంట‌ర్లు
సిఆర్‌వో వ‌ద్ద రెండు కౌంట‌ర్ల‌

భ‌క్తులు వ‌స‌తి కోసం గది కావాలంటే ఈ కౌంటర్లలో పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకున్న భ‌క్తుల‌కు ఎస్ ఎమ్ ఎస్ ద్వారా వారికి కేటాయించిన గ‌దుల స‌మాచారం తెలియ‌జేయ‌బ‌డుతుంది. అనంత‌రం వారికి గ‌దులు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచార‌ణ కార్యాల‌యాల వ‌ద్ద రుసుం చెల్లించి గ‌దులు పొంద‌వ‌చ్చు. ఈ అవ‌కాశాన్ని భ‌క్తులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని టీటీడీ కోరుతోంది.