బోరబండ జూనియర్ కాలేజీలో టాయిలెట్లు అధ్వాన్నం..మానవ హక్కుల కమిషన్ కు న్యాయవాది ఫిర్యాదు

బోరబండ జూనియర్ కాలేజీలో టాయిలెట్లు అధ్వాన్నం..మానవ హక్కుల కమిషన్ కు న్యాయవాది ఫిర్యాదు

పద్మారావునగర్​, వెలుగు: బోరబండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మౌలిక వసతులు లేకపోవడంతో స్టూడెంట్స్​ ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్స్​కు ఫ్లష్ ట్యాంకులు, నీటి వసతి లేకపోవడంతో అవి అధ్వాన్నంగా తయారయ్యాయి. పక్క స్కూల్​లోని టాయిలెట్లను స్టూడెంట్స్ వినియోగిస్తున్నారు. తాగునీటి కొరత, పారిశుధ్య సమస్య నెలకొంది. దీంతో మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. ఇక్కడి పరిస్థితిని చక్కదిద్దేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.