జూబ్లీహిల్స్ , వెలుగు: బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టీ కేసులు నమోదైన 20 మంది నిందితులకు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు బోరబండ పోలీసులు శిక్షను అమలు చేశారు. ఎర్రగడ్డ మానసిక దవాఖాన ఆవరణలో పారిశుధ్య పనులు చేయించారు. చెట్ల కొమ్మలు తొలగించి చెత్తాచెదారాన్ని వారు క్లీన్ చేశారు.
