RK Deeksha: రిలీజ్‌కు రెడీ అవుతున్న.. ప్రతాని రామకృష్ణ గౌడ్ ‘ఆర్కే దీక్ష’..

RK Deeksha: రిలీజ్‌కు రెడీ అవుతున్న.. ప్రతాని రామకృష్ణ గౌడ్ ‘ఆర్కే దీక్ష’..

ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఆర్కే దీక్ష’. కిరణ్ హీరోగా అక్సా ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌‌‌‌గా నటించారు.  తులసి, అనూష, కీర్తన,  ప్రవల్లిక, రోహిత్ శర్మ  కీలక పాత్రలు పోషించారు. ఆదివారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌‌‌‌లో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘ఏప్రిల్ ఫస్ట్ వీక్‌‌‌‌లో  సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీక్ష, పట్టుదల ఉంటే  జీవితంలో ఏదైనా సాధించగలం అని చెప్పే సందేశంతో ఈ మూవీని రూపొందించాం’ అని అన్నారు. నటులు రోహిత్, తులసి పాల్గొన్నారు.