- మొదటి వారం పారిశుద్ధ్యంపై దృష్టి
- 14 వారాల్లో 14 రకాల థీమ్స్
- స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్
- మూడు కార్పొరేషన్ల కమిషనర్లతో సమావేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ సోమవారం మూడు కార్పొరేషన్ల పరిధిలో కమిషనర్లతో వేరు వేరుగా సమావేశాలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్కర్ణన్, సీఎంసీ కమిషనర్ సృజన, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు. స్పెషల్ఆఫీసర్జయేశ్రంజన్మాట్లాడుతూ 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ ని రిజల్ట్ ఓరియెంటెడ్ గా అమలు చేయాలని ఆదేశించారు.14 వారాల పాటు ఒక్కో వారం ఒక్కో థీమ్ తో నిర్వహించాలన్నారు. మొదటి వారం పారిశుద్ధ్యంపై, తర్వాత విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, రైతు, యువత, పర్యావరణం, శుభ్రత, ఆరోగ్యం,చెరువుల సంరక్షణ, అగ్నిమాపక భద్రత ఇలా డిఫరెంట్థీమ్స్తో నిర్వహించాలన్నారు.
2 రోజుల్లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మూడు కార్పొరేషన్లకు ఆస్తులు, అప్పులను పంపిణీ చేసే ప్రక్రియ రిపోర్టు అందించనుందని తెలిపారు. జీహెచ్ఎంసీకి సంబంధించి స్టాండింగ్ కమిటీ లో ఇదివరకు తీర్మానించిన 30 అంశాలపై చర్చించి కార్పొరేషన్ అమోదం తెలిపింది. సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లకు రూ.500 కోట్ల చొప్పున వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయింపులకు ఆమోదించారు. జీహెచ్‌ఎంసీ, మల్కాజ్ గిరి సైబరాబాద్ కార్పొరేషన్ల ఆదాయాలు ఖర్చులు తాత్కాలికంగా జీహెచ్‌ఎంసీ జనరల్ ఫండ్ ద్వారా నిర్వహించేందుకు ఆమోదించారు. బతుకమ్మకుంట పార్క్‌కు వి హనుమంతరావు బతుకమ్మకుంటగా నామకరణం చేసేందుకు ఆమోదించారు.సీఎంసీకి సంబంధించి 25 అంశాలపై చర్చించారు. మొదటి వారంలో ముఖ్యమంత్రి క్యూర్ ప్రాంతాలను విజిట్చేయనున్నట్టు చెప్పారు. ఎంఎంసీకి సంబంధించి 15 అంశాలపై చర్చించి ఆమోదించారు. కార్పొరేషన్లు ఏర్పడిన తరువాత తొలి సమావేశాలు జరిగాయి.
సీఎంఆర్ఎంపీ- 2కు లైన్ క్లియర్
జీహెచ్ఎంసీ సమావేశంలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) రెండో దశను అమలు చేయాలని నిర్ణయించారు. రోడ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం, కొత్త రోడ్ల నిర్మాణం, రిపేర్లు వంటివి పారదర్శకంగా చేసేలా సీఆర్ఎంపీ--2 ను అమలు చేయనున్నారు. పదేండ్ల పాటు ఈ బాధ్యతలను అప్పగించేలా ప్లాన్ చేశారు. రూ. 3145 కోట్ల వ్యయంతో సిటీలోని సుమారు 1045.01 కిలోమీటర్ల పొడవున రోడ్ల మెయింటనెన్స్ చేపట్టనున్నారు.అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ, జోనల్ కమిషనర్లు ప్రియాంక అల, మందా మకరందు, జి ముకుంద రెడ్డి, మంగతాయారు, ఎస్ శ్రీనివాసరెడ్డి, చంద్రకళ, విజిలెన్స్ ఏఎస్పీ నరసింహరెడ్డి, చీఫ్ ఇంజినీర్రత్నాకర్ , జ్యోతిర్మయి, సీసీపీ కే శ్రీనివాస్ పాల్గొన్నారు.
