ఆ వేదిక బాబు సొంత డబ్బులతో కట్టింది కాదు: బొత్స

ఆ వేదిక బాబు సొంత డబ్బులతో కట్టింది కాదు: బొత్స

అమరావతి: ప్రజావేదిక చంద్రబాబు సొంత డబ్బులతో కట్టిన భవనం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ రోజు అమరావతిలో మీడియాతో మాట్లాడిన బొత్స.. ప్రపంచంలోనే గొప్ప రాజధాని నిర్మిస్తామన్న చంద్రబాబు ఏం చేశారో  ప్రజలందరికి తెలుసునని అన్నారు.

గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడు అదే ప్రాధాన్యత ఇస్తామన్నారు బొత్స. జగన్ ఆర్ ఎంబి గెస్ట్ హౌస్ అడిగితే ఇవ్వలేదని, అయినా తాము సర్దుకుపోయామని అన్నారు. అలా అని తాము టీడీపీ మీద కక్ష సాధింపు చర్య చెయ్యడం లేదని అన్నారు. ప్రజావేదికలో గత ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు జరిగాయో ఇప్పుడు అవే జరుగుతాయని అన్నారు.  ప్రజావేదిక అక్రమ కట్టడమైతే దాన్ని కూడా తొలగిస్తామన్నారు. ఈ లోపు టీడీపీ నేతలు గతంలోగా ప్రభుత్వ అధికారులతో వాదన పెట్టుకుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.