రంగారెడ్డి జిల్లాలో గుండెపోటుతో బాలుడు మృతి

రంగారెడ్డి జిల్లాలో గుండెపోటుతో బాలుడు మృతి

గండిపేట, వెలుగు: రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్‌పల్లిలో గుండెపోటుతో ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్​కు చెందిన సంతోష్, శివకుమారి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు అభయ్ (14), ఆయూష్‌  ఉండగా, ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. మైలార్​దేవ్​పల్లిలోని బాబుల్‌రెడ్డినగర్​లో నివాసం ఉంటూ దంపతులిద్దరూ కూలీ పని చేసుకుంటున్నారు. అభయ్‌ స్థానిక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం అభయ్‌ ఇంట్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. కుటుంబసభ్యులు హాస్పిటల్​కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.