హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం

హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం

హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్​లో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. ఉదయం మహా పూర్ణాహుతి, ఉత్సవర అభిషేకం, చక్రస్నానం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం దేవతా ఉద్యాసనం, పుష్ప యాగం, లక్ష్మీనరసింహ స్వామి, నితాయి గౌరంగ, ప్రభుపాదుల వారికి మహా చూర్ణాభిషేకం ఘనంగా నిర్వహించారు.  రాత్రి మహా సంప్రోక్షణ, మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి.