- రాంగోపాల్‌పేటలో ఇందిర విగ్రహావిష్కరణ
పద్మారావునగర్, వెలుగు: దేశానికి దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ కొనియాడారు. రాంగోపాల్‌పేట డివిజన్ అధ్యక్షుడు దుండిగల్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో నల్లగుట్ట అంబేడ్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఇందిర విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి తొలి మహిళా ప్రధానిగా మహిళలు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఇందిర చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. మహేశ్ కుమార్, నాగరాజు, రఘు ముదిరాజ్, ప్రేమ్‌సాగర్, విశాల్ పాల్గొన్నారు.
