వ్యభిచార గృహంపై పోలీసుల రైడ్..కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

వ్యభిచార గృహంపై పోలీసుల రైడ్..కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

మల్కాజిగిరి, వెలుగు: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు రైడ్​ చేశారు. ఏపీలోని ఈస్ట్​గోదావరి తాపేశ్వరానికి చెందిన మహిళ కాప్రా శ్రీరామ్ నగర్ లో ఉంటూ వ్యభిచార దందా నడుపుతోంది. చంద్రశేఖర్ అనే వ్యక్తి సాయంతో మూడు నెలలుగా  హైదరాబాద్ తదితర ప్రాంతాలలో ఇండ్లు కిరాయికి తీసుకొని వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. మహిళలకు డబ్బుల ఆశ చూపించి వ్యభిచార రొంపిలోకి దింపుతోందని సీఐ భాస్కర్​రెడ్డి తెలిపారు. నిర్వాహకులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు.