మహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తాం : కలెక్టర్ జితేశ్ వి.పాటిల్

మహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తాం : కలెక్టర్ జితేశ్ వి.పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని అర్హులైన మహిళలందరికీ చీరలను పంపిణీ చేస్తామని కలెక్టర్ జితేశ్​ వి.పాటిల్​అన్నారు. కలెక్టరేట్​లో పలు శాఖల అధికారులతో బుధవారం సమావేశమై మాట్లాడారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు గ్రామ స్థాయిలో, మార్చి ఒకటో తేదీ నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో చీరలు అందించనున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  

చిన్న నీటి వనరులను లెక్కించాలి

జిల్లాలోని చిన్న నీటి వనరుల లెక్కను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్​జితేశ్​ వి.పాటిల్​ఆదేశించారు. బుధవారం తన క్యాంప్​ఆఫీస్​లో అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఐదేండ్లకోసారి చిన్న నీటి వనరులను లెక్కిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 2 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న చెరువులు, కుంటలు, బోర్లు, బావులు, చెక్​డ్యాంలను మొబైల్ అప్లికేషన్​ద్వారానే లెక్కించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని చెప్పారు. 

మొదట ఒక గ్రామాన్ని యూనిట్​గా తీసుకొని, నమూనా గణన పూర్తి చేసిన తర్వాత మిగిలిన గ్రామాల్లో చేపట్టాలన్నారు.  అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, సీపీవో సంజీవరావు, భూగర్భ జలాల అభివృద్ధి శాఖ అధికారి రమేశ్, ఇరిగేషన్ ఈఈ అర్జున్​పాల్గొన్నారు.