- చెన్నూరులో నియోజకవర్గస్థాయి రివ్యూ మీటింగ్
కోల్‌బెల్ట్, వెలుగు: ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి వాటిని అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. బుధవారం చెన్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్‌లో కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్కలెక్టర్చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఆర్డీవో కిషన్‌తో కలిసి డివిజన్, మండలస్థాయి ఆఫీసర్లతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మంత్రి రివ్యూ నిర్వహించారు.
ప్రతి పథకం, సంక్షేమ ఫలాలు మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఆఫీసర్లపై ఉందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, ఆసరా పింఛన్లు, ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి ఎట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు -అందుకున్న కలెక్టర్‌ను మంత్రి సన్మానించారు.
ఇందిరాగాంధీకి నివాళి
ప్రధానిగా ఇందిరాగాంధీ నిత్యం దేశ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచించారని, పేదల అభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి వివేక్అన్నారు. చెన్నూరు మండలం కిష్టంపేట రైతు వేదికలో ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని ఆమె ఫొటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇందిరాగాంధీ పేదలను ఆదుకునేందుకు గరీబీ హఠావో పథకం అమలు చేశారన్నారు. హరిత విప్లవానికి నాంది పలికారన్నారు. ఆమె స్ఫూర్తితో తెలంగాణలో ప్రజాపాలన సాగుతుంతోందని పేర్కొన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపునకు కృషి చేసిన మంత్రి వివేక్‌ను కాంగ్రెస్ నేతలు గజమాలతో సన్మానించారు.
మాలల రణభేరి పోస్టర్ల ఆవిష్కరణ
హైదరాబాద్ సరూర్‌నగర్ గ్రౌండ్స్‌లో ఈనెల 23న నిర్వహించనున్న ‘మాలల రణభేరి మహాసభ’ పోస్టర్లను మంత్రి మంచిర్యాల హైటెక్ సీటీలోని తన నివాసంలో మాల సంఘం లీడర్లతో కలిసి ఆవిష్కరించారు. సమిష్టి కృషితో రణభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల సంఘం స్టేట్వర్కింగ్ప్రెసిడెంట్పొట్ట మధుకర్, సీనియర్ నాయకులు సుధమల్ల హరికృష్ణ, దమ్మ సునీల్, పండుగ రాజన్న పాల్గొన్నారు. అంతకుముందు మంచిర్యాలలోని సత్యసాయిబాబా ఆలయంలో నిర్వహించిన సత్యసాయి బాబా 100వ పుట్టిన రోజు వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
