రాయికల్, వెలుగు: సౌదీలో జరిగిన యాక్సిడెంట్ చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ బుధవారం జగిత్యాల జిల్లా రాయికల్ టౌన్ కు చేరగా కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన సుతారి ధర్మయ్య(48) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
పేద కుటుంబం కావడంతో ధర్మయ్య డెడ్ బాడీని సొంతూరుకు తీసుకొచ్చేందుకు సాటా రియాద్శాఖ కృషి చేసింది. ఉదయం సొంతూరకు చేరిన డెడ్ బాడీ వద్ద కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతుడు ధర్మయ్యకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
