ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ విజయవంతం చేస్తాం : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ విజయవంతం చేస్తాం : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో ‘ఇందిర  మహిళ శక్తి చీరల పంపిణీ’  విజయవంతంగా చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  

మీటింగ్ తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా స్థిరపడేందుకు పెట్రోల్ బంక్ లు, సోలార్ పవర్ ప్లాంట్స్, ఆర్టిసి లో బస్సుల లీజ్, వడ్డీలేని రుణాలు, బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు, స్త్రీనిధి ద్వారా రుణాలు, యూనిఫామ్స్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తున్నదన్నారు.  

త్వరలో పేటలో ఓల్డ్ ఏజ్ హోం ప్రారంభం తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ తీసుకోవాల్సిన బాధ్యత  ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో రూ. 50 లక్షలతో ఓల్డ్ ఏజ్ హోం త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.  మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ను ప్రారంభిస్తామని తెలిపారు. సీనియర్ సిటిజెన్స్ వివరాలు సేకరిస్తున్నాన్నామన్నారు.