న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ తన ఏడబ్ల్యూఎల్ అగ్రిబిజినెస్ లిమిటెడ్ (గతంలో అదానీ విల్మార్)లో 13శాతం వాటాను విల్మార్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ లెన్స్ పీటీఈ లిమిటెడ్‌కు విక్రయించింది. అదానీ కమోడిటీస్ ఎల్‌ఎల్‌పీ (ఏసీఎల్) 16.9 కోట్ల షేర్లను విక్రయించగా, ఒక్కో షేర్ ధర రూ.275గా లెక్కిస్తే మొత్తం విలువ రూ.4,646 కోట్లుగా ఉంటుంది.
ఏడబ్ల్యూఎల్‌లో 20 శాతం వాటాను అమ్ముతామని అదానీ గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా 13 శాతం వాటా అమ్మింది. ఈ డీల్ తర్వాత ఏసీఎల్ వాటా 20శాతం నుంచి 7శాతానికి తగ్గింది. లెన్స్ వాటా 56.94శాతానికి పెరిగింది.
