బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ 2: తాండవం’ చిత్రం నుంచి ‘జాజికాయ’ అనే పాటను విడుదల చేశారు. తమన్ సంగీతంలో కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను శ్రేయాఘోషల్, బ్రిజేష్ శాండిల్యా పాడారు. వైజాగ్‌లోని జగదాంబ థియేటర్‌లో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఇది తెలుగు సినిమా మాత్రమే కాదు. మన భారతీయ సనాతన హైందవ ధర్మం శక్తి, పరాక్రమాన్ని చాటిచెప్పే సినిమా. మన జాతి మూలాలు ఏంటో తెలియజేసే సినిమా.
అందుకే అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాం. ఇటీవల ముంబైలో ఓ ఈవెంట్ చేశాం. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ప్రమోట్ చేస్తున్నాం. ‘అఖండ’ చిత్రంతో పెరిగిన అంచనాలను అందుకునేలా సీక్వెల్ ఉంటుంది’ అని చెప్పారు. తాను చేసిన ఫస్ట్ మాస్ సాంగ్ ఇదని, సినిమాలో తన పాత్ర సస్పెన్స్‌గా ఉండబోతోందని సంయుక్త చెప్పింది.
బాలయ్యకు ఓపికున్నంతవరకు, తనలో ఊపిరి ఉన్నంతవరకు తమ కాంబినేషన్ రిపీట్ అవుతుందని బోయపాటి శ్రీను అన్నారు. డిసెంబర్ 5న తప్పకుండా ఈ చిత్రాన్ని థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయమని నిర్మాత గోపీ ఆచంట కోరారు.
