న్యూఢిల్లీ: ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి బీఎఫ్ఎస్ఐ కంపెనీలు లావాదేవీల కాల్స్ కోసం ఇకపై 1600 సిరీస్ నంబర్లనే వాడాలని ఆదేశించింది. దీని అమలుకు గడువులను విధించింది.
కమర్షియల్ బ్యాంకులు 2026 జనవరి నాటికి ఈ విధానాన్ని పాటించాలి. పెద్ద ఎన్బీఎఫ్సీలు ఫిబ్రవరి ఒకటో తేదీలోపు, మ్యూచువల్ ఫండ్స్ ఫిబ్రవరి 15 నాటికి, క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లు మార్చి 15 లోపు ఈ సిరీస్లోకి మారాలి. ఇప్పటికే సుమారు 485 కంపెనీ 1600 సిరీస్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇవి మొత్తం 2,800లకు పైగా నంబర్లను తీసుకున్నాయి. సర్వీస్, లావాదేవీల కాల్స్ కోసం ఇప్పటికీ సాధారణ 10 అంకెల నంబర్లను వాడుతున్న సంస్థలు కూడా 1600 సిరీస్ నంబర్లకు మారాలి.
