జూబ్లీహిల్స్, వెలుగు: గంజాయి విక్రయిస్తున్న మహిళలను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ఏ టీం పట్టుకుంది. బాలానగర్ ఫతేనగర్ లో కొందరు మహిళలు గంజాయి విక్రయిస్తున్నట్లు అధికారులకు తెలిసింది. దీంతో ఎస్ టీఎఫ్ఏ టీం లీడర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా ముగ్గురు మహిళలు గంజాయితో పట్టుబడ్డారు. వీరి వద్ద 1.262 కిలోల గంజాయి, రూ.7,690 స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో నలుగురిని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగింయగా కేసులు నమోదు చేశారు.
