మొట్టమొదటి భూ పరిశీలనా శాటిలైట్ : బ్రెజిల్​ నుంచి మన దేశానికి బయల్దేరింది​

మొట్టమొదటి భూ పరిశీలనా శాటిలైట్ : బ్రెజిల్​ నుంచి మన దేశానికి బయల్దేరింది​
అమెజాన్​ అడవుల రక్షణ కోసం బ్రెజిల్​ అమెజానియా శాటిలైట్ ఇస్రోతో ఒప్పందం.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పీఎస్​ఎల్వీ ద్వారా ప్రయోగం న్యూఢిల్లీ: పోయినేడాది అమెజాన్​ అడవులకు అంటుకున్న నిప్పు.. ఎంతో పెద్ద నష్టం చేసింది. భూమికి ఊపిరితిత్తులుగా పిలిచే ఆ అడవుల్లో చాలా భాగం మంటలకు కాలి బూడిదైపోయింది. ఎన్నెన్నో జంతువులు మాడిమసైపోయాయి. అరుదైన మొక్కలు, చెట్లు బొగ్గులా మారాయి. ఇలాంటి కార్చిచ్చులను ముందే పసిగట్టి అరికట్టేందుకు.. బ్రెజిల్​ అమెజానియా 1 అనే శాటిలైట్​ను తయారు చేసింది. దానిని నింగిలోకి పంపనుంది. అందుకు స్పేస్​ రేస్​లో దూసుకుపోతున్న ఇండియన్​ స్పేస్​ రీసెర్చ్​ ఆర్గనైజేషన్​ (ఇస్రో)తో బ్రెజిల్​ ఒప్పందం చేసుకుంది. ​స్పేస్​జర్నీలో తిరుగులేని సక్సెస్​ను సొంతం చేసుకున్న పీఎస్​ఎల్​వీ.. అమెజానియాను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇక, సేద్యం, ఇతర అవసరాలకు చెట్లను నరికేయడం వంటి వాటి వల్ల అడవులకు జరుగుతున్న నష్టాన్ని ఉపగ్రహంతో అంచనా వేయనున్నారు.  దాంతో పాటు పంట పొలాలు, తీర ప్రాంతాలు, భూమికి సంబంధించిన ఇతర అంశాలను అమెజానియా ఉపగ్రహం ద్వారా పర్యవేక్షించనున్నారు. బయల్దేరింది.. ఇప్పటికే అర్జెంటీనా, చిలీ, కొలంబియా, బొలీవియా వంటి దేశాలు ఇస్రోతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. చైనాకూ దూరంగా ఉండేందుకు పరాగ్వే కూడా మనవైపే చూస్తోంది. ఆ బాటలోనే బ్రెజిల్​ ఒప్పందం చేసుకుంది. గురువారం ఎమిరేట్స్​ బీ777 ఫ్లైట్​లో అమెజానియాను మన దేశానికి పంపించినట్టు బ్రెజిల్​ స్పేస్​ ఏజెన్సీ నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఫర్​ స్పేస్​ రీసెర్చ్​ డైరెక్టర్​ సిలేజియో డి నార్డిన్​ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అమెజానియాను ఇస్రో నింగిలోకి పంపనుంది. నిజానికి ఈ ఏడాది జులైలోనే ఉపగ్రహ ప్రయోగం జరగాల్సి ఉన్నా.. కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఇస్రో చేయబోయే ఈ ప్రయోగంలో అమెజానియానే ప్రధాన పేలోడ్​. వైర్ల పొడవే 6 కిలోమీటర్లు బ్రెజిల్​ ప్రయోగించిన మొట్టమొదటి భూ పరిశీలనా ఉపగ్రహం, మూడో రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహం అమెజానియా. అంతకుముందు సీబీఈఆర్​ఎస్​4, సీబీఈఆర్​ఎస్​4ఏ అనే రెండు రిమోట్​ సెన్సింగ్​ శాటిలైట్లను బ్రెజిల్​ నింగిలోకి పంపించింది. అమెజానియా డిజైన్​, అమరిక మొత్తం బ్రెజిల్​లోనే జరిగింది. ఉపగ్రహంలో ఉండే వైర్ల పొడవే దాదాపు 6 కిలోమీటర్లు. మొత్తం 14 వేల ఎలక్ట్రికల్​ కనెక్షన్లున్నాయి. సన్​సింక్రనస్​ ఆర్బిట్​ (సూర్యుడి) కక్ష్యలోకి పంపించే ఈ శాటిలైట్​.. ఐదు రోజులకోసారి భూమి ఫొటోలను తీస్తుంది. అందులో ఏర్పాటు చేసిన వైడ్​ వ్యూ ఆప్టికల్​ ఇమేజర్​ (మూడు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లున్న వీఐఎస్​ విజిబుల్​ స్పెక్ట్రమ్​, నియర్​ ఇన్​ఫ్రారెడ్​ బ్యాండ్​ ఉన్న కెమెరా)తో దాదాపు 850 కిలోమీటర్ల రేంజ్​, 64 మీటర్ల రిజల్యూషన్​తో ఫొటోలు తీయొచ్చు. అమెజానియా సిరీస్​లో రెండు ఇండిపెండెంట్​ మాడ్యూల్స్​ఉన్నాయి. మల్టీ మిషన్​ ప్లాట్​ఫాం (ఎక్కువ మిషన్లు చేసేది) అయిన సర్వీస్​ మాడ్యూల్, కెమెరాలు, ఫొటోలను రికార్డ్​ చేసి భూమికి వాటిని పంపించే పరికరాలుంటే పేలోడ్​ మాడ్యూల్​ ఉంటాయి.