రోజుకో వెరైటీతో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ : మెనూ రిలీజ్ చేసిన ప్రభుత్వం

రోజుకో వెరైటీతో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ : మెనూ రిలీజ్ చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి ప్రతి రోజూ పిల్లలకు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్ పెట్టనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమల్లోకి తెస్తుంది ప్రభుత్వం. 2023, అక్టోబర్ 6వ తేదీన ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. ప్రతి స్కూల్ లో రెగ్యులర్ గా ఉదయం 8 గంటలను టిఫిన్ పెట్టనున్నారు అధికారులు.

ఏ రోజు.. ఏ టిఫిన్.. : మెనూ విడుదల
వారం ఆరు రోజులు విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పెడతారు. ఏ రోజు ఏంటీ అనే లిస్ట్ సైతం రిలీజ్ చేశారు అధికారులు. 

సోమవారం : ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగవారం : పూరీ, ఆలూ కుర్మా లేదా టమాటా బాత్, సాంబార్
బుధవారం : ఉప్మా సాంబార్ లేదా కిచిడీ, చట్నీ
గురువారం : మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం : ఉగ్గాని లేదా పోహ లేదా మిల్లెట్ ఇడ్లీ లేదా చట్నీతో రవ్వ కిచిడీ
శనివారం : పొంగల్, సాంబార్ లేదా వెజ్ పులావ్, రైతా లేదా ఆలూ కుర్మా

సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు.. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ ఇవ్వనుంది ప్రభుత్వం. పిల్లలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది.