ఏడాది కూడా కాలే: రూ.12కోట్లు పెట్టి కట్టిన బ్రిడ్జ్.. కళ్లముందే కుప్పకూలింది

ఏడాది కూడా కాలే: రూ.12కోట్లు పెట్టి కట్టిన బ్రిడ్జ్.. కళ్లముందే కుప్పకూలింది

బీహార్‌లోని అరారియాలోని సిక్తి బ్లాక్ ప్రాంతంలో బక్రా నదిపై వంతెన కూలిపోయి నదిలో పడిపోయింది. అరారియా జిల్లాలోని పద్కియా ఘాట్ దగ్గర కోట్లాది రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. కానీ సంవత్సరం కాకముందుకే కుప్పకూలింది. బ్రిడ్జి కూలీపోతున్నప్పుడు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాంట్రాక్టర్, శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పదరియా బ్రిడ్జ్ మూడు స్తంభాలు నదికి కొట్టుకుపోవడంతో వంతెన కూలిపోవడాన్ని వీడియోలో చూడవచ్చు.