
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ బోణీ చేసింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 32–29తో యూపీ యోధాస్‌పై నెగ్గింది. రైడర్ మణిందర్ సింగ్ (8), సుశీల్ (7), నితిన్ (7), ఫాజెల్ (3) రాణించారు. యూపీ ఆల్‌రౌండర్ భరత్ 13 పాయింట్లు సాధించినా టీమ్‌ను గెలిపించలేకపోయాడు. సుమిత్ (3) కాసేపు పోరాడాడు. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 37–25 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. హర్యానా టీమ్‌లో రైడర్ వినయ్ సూపర్ టెన్ సాధించాడు. నవీన్ (6), శివమ్ (4), రాహుల్ (3) అండగా నిలిచారు.