ఎండ వేడిమికి తట్టుకోలేక పరేడ్‌లో స్పృహ తప్పి, పడిపోయిన ముగ్గురు సైనికులు

ఎండ వేడిమికి తట్టుకోలేక పరేడ్‌లో స్పృహ తప్పి, పడిపోయిన ముగ్గురు సైనికులు

ఈ వేసవిలో కేవలం ఇండియాలోనే కాదు.. ఇతర దేశాల్లోనే ఎండ వేడిమి విపరీతంగా ఉంది. మొన్నటిమొన్న చైనాలో ఓ వ్యక్తి రోజూవారి ఉష్ణోగ్రతలు తట్టుకోలేక ఫ్రిడ్జ్ లో కూర్చున్నాడంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్ లోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయనడానికి ఓ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. వార్షిక ట్రూపింద్ ది కలర్ సందర్భంగా ప్రిన్స్ విలియన్స్ సైనికులు పరేడ్ రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ముగ్గురు సైనికులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. లండన్ లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు చేరుకోవడంతో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఏటా జూన్ లో అక్కడ ట్రూపింగ్ ది కలర్ అనే వేడుక నిర్వహించడం, అందులో భాగంగా సైనికులు కవాతు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

విధి నిర్వహణలో భాగంగా కవాతు సమయంలో వారు ఉన్ని ట్యూనిక్స్, బేర్ స్కిన్ టోపీలు ధరించడంతో వారు ఎండకు తాళలేకపోయారు. ఎండ వేడిమికి తట్టుకోలేక ముగ్గురు సైనికులు స్పృహ తప్పి పడిపోయారని బ్రిటన్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో పడిపోయిన ముగ్గురికి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ప్రిన్స్ విలియం సైనికులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. కల్నల్ రివ్యూలో పాల్గొన్న ప్రతి సైనికుడికి ధన్యవాదాలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో నిబద్దతతో విధులు నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం సైనికులు చేస్తోన్న కృషిని ఆయన అభినందించారు.

https://twitter.com/KensingtonRoyal/status/1667554727859560448