తాగొచ్చి తల్లి, చెల్లిని.. వేధిస్తున్నాడని అన్న హత్య.. ఓల్డ్ సిటీలో ఘటన

తాగొచ్చి తల్లి, చెల్లిని.. వేధిస్తున్నాడని అన్న హత్య.. ఓల్డ్ సిటీలో ఘటన
  •     కత్తితో పొడిచి చంపిన తమ్ముడు

ఓల్డ్​సిటీ, వెలుగు: రోజూ తాగొచ్చి తల్లి, చెల్లిని వేధిస్తున్నాడనే కోపంతో సొంత అన్నను తమ్ముడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటపూల్​కు​చెందిన ఓ కుటుంబం వంట పని చేసుకుంటూ జీవిస్తోంది. కుటుంబంలో మహ్మద్ సమీర్ అలియాస్ అబీబ్ పాషా (26) పెద్దన్న. 

ఇతడు ప్రతిరోజూ తాగొచ్చి ఇంట్లో తల్లిని, చెల్లిని వేధిస్తుండటంతో భరించలేకపోయిన తమ్ముడు మహ్మద్ ఫరూఖ్ పాషా ఆదివారం రాత్రి అన్న ఛాతిపై కత్తితో బలంగా పొడిచి హతమార్చాడు. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఫరూఖ్ పాషా నేరాన్ని  అంగీకరించడంతో కస్టడీలోకి తీసుకున్నట్లు మీర్ చౌక్ ఏసీపీ శ్యాంసుందర్, రెయిన్ బజార్ ఇన్​స్పెక్టర్ నేతాజీ, ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.