- హుజురాబాద్నియోజకవర్గంలో 8 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు
హుజురాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలు, హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కరీంనగర్జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు నియోజకవర్గవ్యాప్తంగా ‘సమరభేరి’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు షెడ్యూల్‌ను వెల్లడించారు. సెప్టెంబర్ 2న హుజురాబాద్‌లో భారీ ధర్నా, 3న వీణవంకలో నిరసనలు, 4న కమలాపూర్‌లో వంటావార్పు, 5, 6, 7, 8వ తేదీల్లో చేపట్లే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
