సామాజిక వర్గాల వారీగా బీఆర్ఎస్ టికెట్లు

సామాజిక వర్గాల వారీగా బీఆర్ఎస్  టికెట్లు

తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది.  115 మంది అభ్యర్థులను ఒకే సారి ప్రకటించిన కేసీఆర్ ఈ సారి ఏడుగురి సిట్టింగులకు సీటు ఇవ్వలేదు. ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే  కేసీఆర్ ఓసీలకు అత్యధికంగా 58 సీట్లు కేటాయించారు. ఏ సామాజికి వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారనేది ఒకసారి చూద్దాం.

సామాజిక వర్గాల వారీగా

  • 115 మంది అభ్యర్థుల్లో ఓసీ- 58,  బీసీ-22, ఎస్సీ-20,ఎస్టీ-12, మైనార్టీ-3, మహిళలు ఏడుగురు ఉన్నారు.
  • ఓసీ 58 మంది అభ్యర్థుల్లో రెడ్డి-40, వెలమ-11,కమ్మ-5, వైశ్య-1, బ్రాహ్మణ-1
  • బీసీ 22 మంది అభ్యర్థుల్లో మున్నూరు కాపు-10,  యాదవ్-5, గౌడ-4, బెస్త-1, వంజర-1, పద్మశాలి-1
  • ఎస్టీ 12 మంది అభ్యర్థుల్లో లంబాడీ-7, ఆదివాసీ-5
  • ఎస్సీ 20 మంది అభ్యర్థుల్లో మాల-8,మాదిక-11, నేతకాని- 1

2018 ఎన్నికల్లో 

2018 ముందస్తు ఎన్నికల్లో ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చారు. 105 మందిలో 35 మంది రెడ్లకు టికెట్ ఇచ్చారు. బీసీలకు 20, ఎస్సీలకు 15, ఎస్టీలకు 14 కేటాయించారు. ముస్లీం 2,  బ్రాహ్మణ 1, వైశ్య 1, సిక్కు1 సీటు ఇచ్చారు.