
V6 న్యూస్ ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని అధికార బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచి మార్చి 14వ తేదీన ఈ మేరకు ప్రకటన విడుదలైంది. పార్టీ మీడియా సమావేశాలకు V6, వెలుగు మీడియా సంస్థలను అనుమతించకూడదని నిర్ణయించింది. మార్చి 9న వీ6, వెలుగును ఎలా బ్యాన్ చేయాలో మాకు తెలుసంటూ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అందుకు కొనసాగింపుగానే ఇప్పుడు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.
వీ6, వెలుగు పత్రికలు నిజాలు, సత్యాలు, ప్రజా సమస్యలను చూపించటాన్ని సహించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రజా సమస్యలపై కథనాలను ఇవ్వటాన్ని డైవర్ట్ చేయటానికి మంత్రి కేటీఆర్ ప్రకటన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. తెలంగాణ ఉద్యమం కోసం.. తెలంగాణ కోసం.. తెలంగాణ గొంతుక కోసం.. తెలంగాణ వాయిస్ గా నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోసం పని చేస్తున్న వీ6 న్యూస్ ఛానెల్, వెలుగు పత్రికపై బ్యాన్ చేయటం ద్వారా.. బీఆర్ఎస్ పార్టీ ఎంత భయపడుతుందో అర్థం అవుతుందనే స్పష్టం అవుతుందంటున్నారు జనం.
బీఆర్ఎస్ బహిష్కరణ లేఖ సారాంశం :
BRS పార్టీ మీడియా సమావేశాలకు V6 న్యూస్ ఛానెల్, వెలుగు పత్రిక ప్రతినిధులను అనుమతించకూడదని నిర్ణయించింది. దీంతోపాటు ఈ సంస్ధలు నిర్వహించే చర్చలతో సహా, ఎలాంటి కార్యక్రమాల్లోనూ పార్టీ ప్రతినిధులెవరూ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ సారాంశంతో లేఖ రిలీజ్ అయ్యింది.