- బీఆర్ఎస్ మద్దతుతోనే బీజేపీ ఒకట్రెండు మున్సిపాలిటీలను దక్కించుకుంది: కవిత
- మహిళలకు కాంగ్రెస్ ఇస్తామన్న రూ.2,500 వెంటనే ఇవ్వాలి
- జాగృతి నేతలతో కలిసి ప్రజాభవన్‌ను ముట్టడించిన కవిత
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ మద్దతుతోనే బీజేపీ రాష్ట్రంలో ఒకటో, రెండో మున్సిపల్ చైర్మన్ పదవులను దక్కించుకున్నదన్నారు. ఈ రెండు పార్టీల పొత్తుపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజమని మున్సిపల్ ఎన్నికల్లో తేలిం దన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలని, వృద్ధాప్య, దివ్యాంగ సహా ఇతర పింఛన్లను పెంచా లని, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని, యువతులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి, మహిళలతో కలిసి మంగళవారం బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌ను ఆమె ముట్టడించారు.
కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా, ప్రియాంక గాంధీ జోక్యం చేసుకొని మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు సహా ఇతర వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయించాలని నినాదాలు చేశారు. జాగృతి నాయకుల ప్రజా భవన్ ముట్టడితో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ప్రజావాణి అధికారులతో చర్చించి కవిత సహా ఆందోళనకారులను ప్రజాభవన్ లోపలికి అనుమతించారు.
దీంతో ప్రజా వాణి స్పెషల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్‌ను కలిసి మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును కోరుతూ కవిత వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కరీంనగర్, నారాయణపేట్‌లో బీఆర్ఎస్ హాజరుకాకపోవడంతోనే బీజేపీకి మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులు దక్కాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీల అంతర్గత సహకారం ఈ ఎన్నికలతో బహిర్గతమయిందన్నారు. నారాయణపేటలో జాగృతి నాయకురాలికి దక్కాల్సిన వైస్ చైర్ పర్సన్ పదవిని రెండు పార్టీలు కలిసిపోయి రాకుండా చేశాయన్నారు.
అంగన్వాడీల్లో రాజకీయ జోక్యం సరికాదు
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం జీవో ఇచ్చిందని, దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో పనిచేస్తున్న అంగ న్వాడీలను గ్రామ పంచాయతీల పరిధిలోకి తేవడం సరికాదన్నారు. గర్భిణులు, చిన్నపిల్ల లకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీల ను యథాతథంగా కొనసాగించాలని కోరా రు.
అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు ప్రభుత్వం ఏ పని అప్పగించినా కష్టపడి పనిచేస్తారని.. అలాంటి వారిని ఇబ్బంది పెట్టే చర్యలకు పుల్ స్టాప్ పెట్టాలన్నారు. 6 నుంచి 9నెలల పాటు అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వకపోవడం అన్యాయమని నిలదీశారు.
