నమ్మకానికి కేసీఆర్.. నయవంచనకు కాంగ్రెస్: హరీష్ రావు

నమ్మకానికి కేసీఆర్.. నయవంచనకు కాంగ్రెస్: హరీష్ రావు

రేపు(అక్టోబర్ 17) సిద్దిపేటలో బీఆర్ఎస్ ఆశీర్వాద సభ నిర్వహిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. లక్షమందితో సభ నిర్వహిస్తామని మని స్పష్టం చేశారు. 20వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ ముందుందని ధీమా వ్యక్తం చేశారు. 

నమ్మకానికి మారుపేరు కేసీఆర్.. నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. నిన్న(అక్టోబర్ 15) బీఆర్ఎస్ మేనిఫెస్టో చూడగానే ప్రతిపక్షాల ఫిజులు ఎగిరిపోయాయి.. వాళ్లకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నారు. మేనిఫెస్టో కాపీ కొట్టింది.. మేము కాదు మీరేనని కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఇలాంటి నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. 

పార్లమెంట్ లో తెలంగాణ ప్రభుత్వ పని తీరును ప్రశంసించి అధికారులే.. ఓట్ల కోసం తెలంగాణ గల్లీల్లో వచ్చి విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. మీరు గతంలో చెప్పిన మాటలు నిజమా ఇప్పడు ఓట్ల కోసం తెలంగాణ గల్లీల్లో వచ్చి మా పథకాలను తిడుతున్నది నిజమా తేల్చి చెప్పాలని బీఆర్ఎస్ నాయకులను నిలదీశారు. మరి తెలంగాణ పథకాలకు ఎందుకు అవార్డులు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలు అమాయకులు కాదని.. అన్ని గమనిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. ఏది ఏమైనా మూడోసారి సీఎం కేసీఆర్ హ్యాటిక్ కొడతారని.. ప్రజలంతా తమ పార్టీవైపే ఉన్నారని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.