ములుగును అభివృద్ధి చేసిందే బీఆర్​ఎస్​ : బడే నాగజ్యోతి

ములుగును అభివృద్ధి చేసిందే బీఆర్​ఎస్​ : బడే నాగజ్యోతి

ములుగు, వెలుగు : అరవై ఏళ్ల కాంగ్రెస్​ పాలనలో చేయని అభివృద్ధి పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో జరిగిందని, ములుగను అభివృద్ధి చేసిందే ముఖ్యమంత్రి కేసీఆర్​ సారథ్యంలోని ప్రభుత్వమన్న విషయం గుర్తుంచుకోవాలని జడ్పీ చైర్​ పర్సన్​, బీఆర్​ఎస్​ అభ్యర్థి బడే నాగజ్యోతి స్పష్టం చేశారు.  మంగళవారం ములుగు మండలంలోని పొట్లాపూర్, పత్తిపల్లి, చింతకుంట, చింతలపల్లి, చిన్న గుంటూరుపల్లి, కోడిశాల కుంట, భాగ్యతండ, బండారుపల్లి, మదనపల్లి తదితర గ్రామాల్లో నాగజ్యోతి ప్రచారం నిర్వహించారు. 

అనంతరం ములుగులోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.  బీఆర్​ఎస్​కు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆదివాసీ బిడ్డగా తాను పోటీచేస్తే అక్కసు వెల్లబోసుకుంటున్నారని విమర్శించారు.  కార్యక్రమాల్లో రెడ్కో చైర్మన్​ ఏరువ  సతీశ్​ రెడ్డి, బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్​ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఎంపీటీసీలు, విజయ్​ రాం నాయక్​, మహేశ్​ నాయక్​ పాల్గొన్నారు.