
నెలాఖరులో మళ్లీ మహారాష్ట్రకు కేసీఆర్
నాందేడ్‌లో ఆఫీస్ ఓపెన్ చేయనున్న పార్టీ చీఫ్
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్చీఫ్, సీఎం కేసీఆర్ ఈ నెలాఖరులో మళ్లీ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. నాందేడ్‌లో పార్టీ ఆఫీస్ కోసం ఇప్పటికే బిల్డింగ్కొనుగోలు చేశారు. ఆ భవనం ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే పర్యటనలో ఔరంగాబాద్‌లో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి భూమిపూజ కూడా చేస్తారని తెలిసింది.
స్థానిక బీఆర్ఎస్ నాయకులు పార్టీ ఆఫీస్నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేశారని, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెప్తున్నారు. కేసీఆర్ మహారాష్ట్రలో ఇప్పటికే 3 సార్లు పర్యటించారు. నాందేడ్జిల్లా కేంద్రం, అదే జిల్లాలోని కాంధార్లోహ, ఔరంగాబాద్ బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు.