సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో కేటీఆర్, హారీశ్‌రావు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత కుటుంబసభ్యులు సహా పలువురు పాల్గొన్నారు.
కాంగ్రెస్ తమ అభ్యర్థిగా శ్రీగణేశ్ పేరును ప్రకటించిన నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం కేసీఆర్ వేట కొనసాగిస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యుల్లో ఒకరైన.. ఆమె చెల్లి నివేదిత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి సుముఖత వ్యక్తం చేస్తుంది. దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత మృతితో ఇక్కడ బైపోల్ అనివార్యమైంది. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.