
ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా రూములు నిర్మించాడు ఓ కార్పొరేటర్. విషయం తెలుసుకున్న హుడా అధికారులు పోలీసుల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భాగ్యనగర్ కాలనీలోని సర్వే నెంబర్లు 316, 317లలో గుట్టు చప్పుడు కాకుండా.. 20 డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్ కుతాడి సాయితోపాటు కొంత మంది కలిసి 2 రూములు నిర్మించారు.
ఈ విషయం తెలుసుకున్న మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ ఎం.శివ జనార్థన్ తమ సిబ్బంది, పోలీసుల సహాయంతో మే 2వ తేదీ మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. అనంతరం హుడా ల్యాండ్ కబ్జాచేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో జవహర్ నగర్ ఎస్ఐ నాగరాజు కేసు నమెదు చేసుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు.