టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి పీటలెక్కబోతున్నారు. గురువారం (2026 ఫిబ్రవరి 26న) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ‘మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్’లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు పరిమిత సంఖ్యలోనే అతిథుల ఆహ్వానించారు. ఇప్పటికే మెహందీ ముగియగా, బుధవారం (ఫిబ్రవరి 25) హల్దీ, సంగీత్ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ప్రైవేట్ వేడుకకు హాజరయ్యారు.
వైరల్‌గా మారిన రిషభ్ శెట్టి రియాక్షన్!
రష్మిక వివాహ వేడుకలు ఒకవైపు సంబరంగా సాగుతుంటే, మరోవైపు కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమె పాత పరిచయాల ప్రస్తావన వస్తోంది. ముఖ్యంగా 'కాంతార' స్టార్ రిషభ్ శెట్టి స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రష్మిక తన సినీ ప్రయాణాన్ని రిషభ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన 'కిరిక్ పార్టీ'తోనే ప్రారంభించింది. ఆ సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ఆమె ప్రేమలో పడటం, నిశ్చితార్థం జరగడం, ఆపై రద్దు కావడం తెలిసిందే.
ALSO READ : విజయ్, రష్మిక పెళ్లి సందడి.. లైవ్ అప్ డేట్స్ !
తాజాగా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శించుకున్న తర్వాత రిషభ్‌ను మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయనను "రష్మిక తన పెళ్లికి మిమ్మల్ని పిలిచిందా?" అని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న విన్న వెంటనే రిషభ్ శెట్టి ఎలాంటి సమాధానం చెప్పకుండా, సున్నితంగా "థ్యాంక్యూ" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలో వీరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగానే ఆయన ఇలా రియాక్ట్ అయ్యారని నెటిజన్లు భావిస్తున్నారు.
#RishabShetty ignored #RashmikaMandanna’s marriage invitation question
— cinee worldd (@Cinee_Worldd) February 25, 2026
pic.twitter.com/gwUFUpj9AC
రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ వరకు..
విజయ్, రష్మికల ప్రయాణం 'గీత గోవిందం'తో మొదలైంది. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేయడమే కాకుండా, నిజజీవితంలోనూ ప్రేమ చిగురించడానికి కారణమైంది. 'డియర్ కామ్రేడ్' సమయంలో బలపడిన వీరి బంధం, విదేశీ వెకేషన్లు, సోషల్ మీడియా హింట్లతో ఫ్యాన్స్‌ను ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ ప్రేమ జంట అధికారికంగా పెళ్లి పీటలెక్కడం అభిమానులకు పండుగలా మారింది.
