మంత్రి జగదీష్‌రెడ్డి నుండి ప్రాణహాని ఉంది ..బీఆర్ఎస్ కౌన్సిలర్ ఫిర్యాదు

మంత్రి జగదీష్‌రెడ్డి  నుండి ప్రాణహాని ఉంది ..బీఆర్ఎస్  కౌన్సిలర్ ఫిర్యాదు

మంత్రి జగదీష్‌రెడ్డి  నుండి తనకు తన భర్తకు ప్రాణహాని ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ చెందిన కౌన్సలర్ రేణుక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. సూర్యాపేట జిల్లా మార్కెటింగ్ సొసైటీ ఛైర్మెన్ తన భర్త వట్టే జానయ్య యాదవ్ పై మంత్రి జగదీష్‌రెడ్డి అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని రేణుక తన ఫిర్యాదులో పేర్కొంది. 

బలహీన వర్గాలకు చెందిన తమకి జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కొరినందుకు... ఒక్కరోజులోనే పోలీసులతో 71 కేసులను పెట్టించి భయాందోళనకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గత 20 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని, మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరుడిగా ఉన్న తన భర్త ఎమ్మెల్యే టికెట్ అడిగినందుకు మంత్రి ఇలా వ్యవహరిస్తున్నారంటూ వాపోయింది.

 ఇప్పుడు తన భర్త ఆచూకీ కూడా తెలియడం లేదని, మంత్రి నుండి తమకు ప్రాణహాని ఉందని , రక్షణ కల్పించాలంటూ  ఆమె  కమిషన్ ను వేడుకుంది.