గాంధీ ఆసుపత్రిలో బాలింత మృతి..వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన

గాంధీ ఆసుపత్రిలో బాలింత మృతి..వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్  బన్సీలాల్ పేట డివిజన్  బోయిగూడకు చెందిన సంజన(26) గాంధీ ఆసుపత్రిలో డెలివరీ అయిన కొద్ది సేపటికే చనిపోయింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం తెల్లవారుజామున డాక్టర్లు సంజనకు సిజేరియన్  చేసి డెలివరీ చేశారు. 6 గంటల ప్రాంతంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై చనిపోయింది.

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయిందని మృతురాలి తల్లి, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇదిలాఉంటే సంజనను కాపాడేందుకు డ్యూటీ డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని  గైనకాలజీ హెచ్ వోడీ డాక్టర్  శోభ తెలిపారు. ఎంబాలిజం కారణంగా సడెన్ గా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా మారుతుందన్నారు. సీపీఆర్​ చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.