రామచంద్రాపురం, వెలుగు: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్లో భాగంగా తెల్లాపూర్ పరిధిలోని విద్యుత్నగర్ను భారతీనగర్ డివిజన్లో, వెలిమెలను ముత్తంగి డివిజన్లో కలిపి ఇక్కడి ప్రజలకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని తెల్లాపూర్ మాజీ సర్పంచ్మల్లేపల్లి సోమిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్రాములు గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. వెలిమెల, విద్యుత్ నగర్లను కొత్తగా ఏర్పడిన తెల్లాపూర్ డివిజన్లో కలపాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, స్థానికులతో కలిపి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
సోమిరెడ్డి మాట్లాడుతూ..తెల్లాపూర్‌కు వంద అడుగుల దూరంలో ఉన్న కాలనీని తీసుకెళ్లి పది కిలోమీటర్ల దూరంలోని సర్కిల్లో కలపడం అధికారుల అనాలోచిత చర్యలని మండిపడ్డారు. ముత్తంగికి ఎలాంటి సంబంధం లేని వెలిమెలను కలిపి అక్కడి ప్రజల కష్టాలకు కారణం అవబోతున్నారన్నారు.
ఈ విషయంలో జీహెచ్ఎంసీ కమీషనర్, ఇతర అధికారులను కలిశామని కాంగ్రెస్ నాయకులు సైతం ఈ ప్రాంత ప్రజల మనోవేధనను అర్ధం చేసుకొని సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు లచ్చిరాం, బాబ్జీ, శ్రీశైలం, నాగరాజు, రవీందర్ రెడ్డి, కుమార్‌యాదవ్, ఉమేశ్, బీఆర్ఎస్ తెల్లాపూర్ ప్రెసిడెంట్ దేవేందర్, పీఏసీఎస్మాజీ చైర్మన్బుచ్చిరెడ్డి, వివిధ కాలనీల ప్రెసిడెంట్లు, అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
