కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం.. పెట్రోల్ పంప్ తొలిగింపు

కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం.. పెట్రోల్ పంప్ తొలిగింపు

రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణంలో భాగంగా పక్కనే ఉన్న పెట్రోల్ పంప్ను తొలిగిస్తున్నారు. ఈ స్థలంలో సచివాలయ ప్రహరీ గోడ కట్టనున్నారు. గత 30 ఏళ్లుగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ పంప్ నడుస్తోంది. ఈ పంప్లో ప్రజలతో పాటు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ సప్లై చేసేవారు. ప్రస్తుతం ఈ పంప్ను కవాడిగూడ ప్రాంతానికి తరలిస్తున్నట్లుగా అధికారులు నోటీసుల్లో తెలిపారు. సీఎం కేసీఆర్‌ జన్మదినమైన ఫిబ్రవరి 17న  నూతన సెక్రటేరియట్‌ ప్రారంభంకానుంది.