టీచర్ పోస్టుల భర్తీలో బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్​: కిషన్ రెడ్డి

టీచర్ పోస్టుల భర్తీలో బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్​: కిషన్ రెడ్డి

ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో టీచర్ పో స్టుల భర్తీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఖాళీల కారణంగా ప్రభుత్వ స్కూళ్లు నిర్వీర్యమయ్యే  పరిస్థితి నెలకొందన్నారు. ఖాళీగా ఉన్న 25వేల టీచర్ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.  ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంబర్ పేట మండల్ రికగ్నైజ్ డ్​ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్​ సీ టాపర్ విద్యార్థులు, టీచర్లకు అభినందన సభ నిర్వహించారు. 

ముఖ్యఅతిథిగా కిషన్ రెడ్డి హాజరై విద్యార్థులు, టీచర్లను సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం లో బడ్జెట్ స్కూల్స్, ప్రైవేట్ విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని, సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం హై లెవల్ కమిటీ వేసి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అమృత, పద్మ, అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, మోహన్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, రవి, రాజశేఖర్ రెడ్డి, శోభారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు