ఏం చేద్దాం!.. జూబ్లీహిల్స్ ఓటమిపై.. బీఆర్ఎస్‌‌లో అంతర్మథనం

ఏం చేద్దాం!.. జూబ్లీహిల్స్ ఓటమిపై.. బీఆర్ఎస్‌‌లో అంతర్మథనం
  • వరుస పరాజయాలతో నారాజ్.. గులాబీ కేడర్‌‌‌‌లో తగ్గిన జోష్ 
  • కేటీఆర్ ​వ్యవహార శైలిపై పార్టీ నేతల్లో అసంతృప్తి
  • ఆయన సరిగ్గా లీడ్​ చేయలేకపోతున్నారనే భావన
  • కేసీఆర్​ ఫామ్‌‌హౌస్‌‌కే పరిమితమవడంపైనా ఆందోళన 
  • పెద్ద లీడర్లకే టైమిస్తూ కేడర్‌‌‌‌ను పట్టించుకోవడం లేదని ఆవేదన 
  • తీరు మార్చుకోకుంటే వేరే దారి చూసుకునే యోచనలో నేతలు  
  • బైపోల్‌‌ రిజల్ట్ విషయంలో కేటీఆర్‌‌‌‌పై కేసీఆర్ అసంతృప్తి..
  • ఫామ్‌‌హౌస్‌‌లో మంతనాలు 

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్​ఉప ఎన్నికల ఫలితాలు.. బీఆర్ఎస్​పార్టీకి మింగుడుపడడం లేదు. కక్కలేక.. మింగలేక.. పార్టీ పెద్దలు అంతర్మథనంలో పడిపోయారు. వరసపెట్టి ఓటములే స్వాగతం పలుకుతుండడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం.. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్​ఎన్నికల్లో ఒక్క సీటునూ గెలుచుకోకపోవడం.. అనంతరం రెండు ఉప ఎన్నికల్లోనూ సిట్టింగ్​స్థానాలనూ కోల్పోవడంతో గులాబీ కేడర్​ నారాజ్​అవుతున్నది. 

కేటీఆర్​లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్​పైన, ఆయన వ్యవహారశైలిపైనా కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారమూ జరుగుతున్నది. కేటీఆర్​ ముందుండి నడిచినా సరైన వ్యూహాలు లేకపోవడం, సరిగ్గా లీడ్​చేయలేకపోవడం వల్లే పార్టీ ఇన్ని ఎన్నికల్లో ఓడిపోయిందనే భావనలో కొందరు లీడర్లు ఉన్నట్టు చెబుతున్నారు. అలాగే కేసీఆర్​ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌ను వీడి బయటకు రాకపోతుండడం కూడా పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నది. ఇప్పుడు ఈ వరుస ఓటములు పెద్దసారునూ కలవరపెడుతున్నాయన్న చర్చ జరుగుతున్నది.

లోపం ఎక్కడుంది?

ప్రభుత్వంపై ఎంతగా ఎటాక్​చేస్తున్నా పార్టీకి కలిసిరాకపోగా.. మరింత నష్టం జరుగుతున్న తీరుపై బీఆర్ఎస్​అధినేత కేసీఆర్​ఆలోచనలో పడిపోయారని పార్టీలోని కొన్ని వర్గాల్లో టాక్​నడుస్తోంది. ఎక్కడికక్కడ పార్టీ సీనియర్లను రంగంలోకి దింపి ముందు నుంచీ వ్యూహాలు అమలు చేస్తున్నా.. ఎందుకు బెడిసి కొడుతున్నదో అర్థంకాక నేతలంతా తలపట్టుకుంటున్నారు. 

వచ్చే టర్మ్​లో అధికారం తమదే అని గంభీరంగా చెప్పుకుంటున్నా.. లోలోపల మాత్రం బీఆర్ఎస్​నేతలంతా ఆందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో పలువురు లీడర్లు కేటీఆర్​నాయకత్వ తీరుపైనే విమర్శలు ఎక్కుపెడ్తున్నారు. ఆయన మాట తీరు మార్చుకోవాలని, అహంకార ధోరణి విడనాడితేనే పార్టీకి మనుగడ ఉంటుందని చెప్తున్నారు. అధికారం పోయినా కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అహంకారం తగ్గలేదంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలే ఇందుకు ఉదాహరణ అంటూ వివరిస్తున్నారు. 

ఇలాంటి ఓటములు ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో కేసీఆర్, కేటీఆర్​అంతర్మథనం చేసుకోకుండా.. జనాలపైకి నెపం నెట్టడాన్ని సైతం కొందరు నేతలు తప్పుపడ్తున్నారు. ‘‘ఓటమి తర్వాత రివ్యూ  చేయరు.. నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోరు..  చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా ఎదుటి వారు గెలిచిన తీరును తప్పుపెట్టడం ఎంతవరకు కరెక్ట్?​’’ అని ఓ సీనియర్​ నేత ‘వెలుగు’తో పేర్కొన్నారు. 

‘‘కేసీఆర్​ఫాంహౌస్​దాటి బయటకు రారు.. కేటీఆర్​సోషల్​మీడియాలో తప్ప ప్రజల్లో పోరాటలు చేయరు.. వీళ్ల తీరుతో కేడర్​నారాజ్‌‌‌‌‌‌‌‌గా ఉంది.. కవిత  చెప్పినట్లు రామన్న గ్రౌండ్‌‌‌‌‌‌‌‌కు వస్తే తప్ప పరిస్థితులు మారవు..’’ అని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే పార్టీకి నష్టం జరిగిందని, మిగిలి ఉన్న కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పట్టించుకోకుంటే బీఆర్ఎస్​పరిస్థితి మరింత దిగజారడం ఖాయమని హెచ్చరించారు.  

బడా లీడర్లకే కేసీఆర్​ అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్​

బీఆర్ఎస్​అధినేత కేసీఆర్ కూడా పార్టీ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం కోల్పోయామని చెప్పి ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌కే పరిమితమైతే కేడర్​ఎలా ఉత్సాహంగా పని చేస్తుందని కొందరు లీడర్లు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌లోనే ఉంటూ.. కేవలం బడా లీడర్లకే పెద్ద సారు ప్రాధాన్యం ఇస్తున్నారని, తనకు కావాల్సిన.. తనకు దగ్గరుండే అతి కొద్ది మంది లీడర్లతోనే మాట్లాడుతూ.. కేడర్​ను మాత్రం విస్మరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. 

ఇప్పటికైనా కేసీఆర్​ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌ను వీడి బయటకొచ్చి లీడ్​చేస్తేనే పార్టీ భవిష్యత్తులో నిలదొక్కుకుంటుందని, లేదంటే మనుగడ కష్టమని కొందరు నేతలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇకనైనా పార్టీ పెద్దలు తీరు మార్చుకుని వ్యవహారాలను సరిచేస్తే ఓకేగానీ.. లేదంటే మాత్రం తమ దారి తాము చూసుకోక తప్పదన్న యోచనలో ఇంకొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో  కేసీఆర్​తో నేతల​భేటీ..

జూబ్లీహిల్స్​ఉప ఎన్నిక ఫలితాలు నిరాశ మిగల్చడంతో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. వరుసపెట్టి ఎందుకు ఫెయిల్​అవుతున్నామని, గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి ఎందుకు వెళ్లడం లేదని మందలించినట్టు సమాచారం. ఫలితాలపై శనివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు నేతలతో కేసీఆర్​ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఓటమికి కారణాలపై విశ్లేషించినట్టు తెలిసింది. 

జనంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌పై వ్యతిరేకత ఉన్నది వాస్తవమేనని, కానీ ఓ వర్గం ఓట్లు గంపగుత్తగా ఆ పార్టీకి పడడం వల్లే ఓడిపోయామని నేతలు చెప్పినట్టు తెలిసింది. గతంలో బీఆర్ఎస్​వైపు ఉన్న వర్గాలు చేజారుతుంటే ఏం చేస్తున్నారని, వాళ్ల ఓట్లను పోలరైజ్​చేయడంలో ఎందుకు విఫలమయ్యామని కేసీఆర్​గట్టిగా నిలదీసినట్లు సమాచారం. 

మొత్తంగా వరుస వైఫల్యాలకు కారణం ఏంటో తెలుసుకోవాలని, వెంటనే కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. వీలైనంత వరకు క్షేత్రస్థాయిలో తిరగాలని, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడికక్కడ ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వంపై పోరాడాలని సూచించినట్లు సమాచారం. 

ఈ క్రమంలోనే మంగళవారం జూబ్లీహిల్స్ లీడర్లు,  కార్యకర్తలతో కేటీఆర్​ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలకు ప్లాన్​చేసుకుంటున్నట్టు తెలిసింది.