అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..
  • ఇయ్యాల బీఆర్ఎస్ జాయింట్ ఎల్పీ మీటింగ్
  • సర్వే నివేదికల ఆధారంగా మాట్లాడనున్న కేసీఆర్
  • హాజరుకానున్న 150 మంది నేతలు.. వీరిలోనే ‘అసెంబ్లీ’ అభ్యర్థులు!

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బుధవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేటివ్ పార్టీ ఉమ్మడి సమావేశం జరగనుంది. పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్​అధ్యక్షతన నిర్వహించే ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది డిసెంబర్​మొదటి వారంలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఎన్నికలు ఉండే అవకాశముందని కేసీఆర్ ఇప్పటికే రెండు సమావేశాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసే ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ ప్రభావం పార్టీపై పడకుండా, లీడర్ల స్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకే జాయింట్ ఎల్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేసీఆర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఇటీవల నిర్వహించిన సర్వే నివేదికల ఆధారంగానే కేసీఆర్ ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడుతారని, ఎన్నికల్లో గెలుపే ప్రధాన ఎజెండా అని బీఆర్ఎస్​ ముఖ్య నేతలు చెప్తున్నారు. సర్వేల్లో ఎవరు ముందున్నారనే వివరాలు మాత్రమే వెల్లడించే అవకాశముందని, మిగతా వారి వివరాలు చెప్పకుండా ఓవరాల్​గా కారు పార్టీ గెలువబోయే సీట్లెన్నో చెప్పి, మళ్లీ భారీ విజయం సాధించబోతున్నామని చెప్తారని తెలుస్తున్నది.

అక్కడి ‘ఫలితం’ ఎఫెక్ట్

పార్లమెంటరీ, లెజిస్లేటివ్ పార్టీ ఏర్పాటుకు ప్రధాన కారణం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలేనని నేతలు చెప్తున్నారు. అక్కడి రిజల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా క్యాడర్​నిరాశకు గురికాకుండా వారిలో ఉత్సాహం నింపడమే కేసీఆర్​ఉద్దేశమని అంటున్నారు. కర్నాటక రిజల్ట్​తర్వాత నిర్వహించిన ఒక ఫ్లాష్ సర్వే రిపోర్టు కూడా రాష్ట్రంలో గెలువబోయేది తామేనని చెప్తోందని, ఆ మేరకు వివరాలు వెల్లడించే అవకాశముందని తెలుస్తున్నది. సిట్టింగులందరికీ టికెట్లిస్తామని గతంలో కేసీఆర్​పలుమార్లు చెప్పారు. కానీ సర్వే నివేదికల్లో మెజార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చిందని, వారి స్థానంలో ఇప్పుడున్న ఎంపీలు, ఎమ్మెల్సీలనే అభ్యర్థులుగా పోటీకి దించే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నారని నేతలు చెప్తున్నారు. కొన్ని కొత్త ముఖాలకూ చాన్స్ ఇవ్వొచ్చని సమాచారం. బుధవారం జరిగే మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే సుమారు 150 మందిలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులుంటారని తెలుస్తున్నది. ఆగస్టులో ఇలాంటిదే ఇంకో సమావేశం నిర్వహించే అవకాశముందని, ఆలోగా పనితీరు మార్చుకున్న వారు మాత్రమే 2023 ఎలక్షన్​టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటారని, లేనివారు ఆశలు వదిలేసుకోవాలని కేసీఆర్​తేల్చిచెప్పే అవకాశముందని సమాచారం.