బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయం : మంత్రి కోమటిరెడ్డి

  బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయం : మంత్రి కోమటిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలనను ప్రజలకు మరింత దగ్గర చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నల్లగొండలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

విద్యుత్ శాఖ అప్పుల్లో కూరుకుపోయిందని కరెంట్ బిల్లులు కట్టొద్దు అని అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటలు నమ్మొద్దని కోమటిరెడ్డి సూచించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు వివాదాస్పదం కావడానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. ఎస్ ఎల్ బీసీ సరిగ్గా పూర్తి కాకపోవడం వల్ల ఎస్టీమేషన్ భారీగా పెరిగిందని 5 ఏళ్లలో తాము పూర్తి చేస్తా్మని చెప్పారు. ప్రజాధనాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారని అన్నారు.