మన ఆడపడుచులతో అందగత్తెల కాళ్లు కడిగిస్తారా : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

మన ఆడపడుచులతో అందగత్తెల కాళ్లు కడిగిస్తారా : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
  • మహిళా కమిషన్ కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

పద్మారావునగర్, వెలుగు: రామప్ప దేవాలయం సందర్శనకు వచ్చిన మిస్​వరల్డ్​కంటెస్టెంట్ల కాళ్లను తెలంగాణ ఆడపడుచులతో కడిగించడమేమిటని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్​కార్పొరేటర్లు ప్రశ్నించారు. గురువారం తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళలను అవమానించిందని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

కాంగ్రెస్ ప్రభుత్వానికి గొప్ప పేరు రావాలంటే వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ మహిళా మంత్రుల చేత విశ్వసుందరుల కాళ్లు కడిగించాల్సిందని మండిపడ్డారు. రామప్ప వద్ద బతుకమ్మను అగౌరవపరిచేలా కాళ్లకు చెప్పులతో బతుకమ్మ ఆడించడం ఎంతవరకు కరెక్ట్​అన్నారు. బీఆర్ఎస్​నాయకులు, కార్పొరేటర్లు పాల్వాయి స్రవంతి, సామల హేమ, కంది శైలజ, రాసూరి సునీత, అర్పిత, డా.సత్య, అరుణ, రమాదేవి పాల్గొన్నారు.