మూడు డివిజన్ల డీలిమిటేషన్లో సవరణలు చేయండి : బీఆర్ఎస్ నేతలు

మూడు డివిజన్ల డీలిమిటేషన్లో సవరణలు చేయండి :  బీఆర్ఎస్ నేతలు
  •     జీహెచ్​ఎంసీ కమిషనర్​ను కోరిన బీఆర్ఎస్​ నేతలు

రామచంద్రాపురం, వెలుగు: పటాన్​చెరు పరిధిలో మూడు డివిజన్ల డీలిమిటేషన్​లో సవరణలు చేయాలని పటాన్​చెరు బీఆర్ఎస్​కో ఆర్డినేటర్​ వెన్నవరం ఆదర్శ్​రెడ్డి అధికారులను కోరారు. శనివారం భారతీనగర్​ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్​రెడ్డి, తెల్లాపూర్​ మాజీ సర్పంచ్​ సోమిరెడ్డి, ఇతర నియోజకవర్గ నాయకులతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్​ఆర్​వీ కర్ణన్​కు వినతిపత్రం అందజేశారు. 

ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ కొత్త వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. భౌగోళికంగా తెల్లాపూర్​కు పక్కనే ఉన్న వెలిమెలను పటాన్​చెరు పరిధిలో ఉన్న ముత్తంగి డివిజన్​లో కలపడం అనాలోచిత చర్యని, వెంటనే వెలిమెలను తెల్లాపూర్​ డివిజన్​లో కలపాలని డిమాండ్ చేశారు. విద్యుత్​ నగర్​ కాలనీని రెండు డివిజన్లలో కలపడం వల్ల పరిపాలనా, మౌలిక సౌకర్యాల సమస్యలు ఏర్పడుతాయని, విద్యుత్ నగర్​ కాలనీని పూర్తిగా తెల్లాపూర్​లో కలపాలని కోరారు. 

అమీన్​పూర్​ సర్కిల్ పేరును రామచంద్రాపురం సర్కిల్​గా మార్చాలని, సర్కిల్ కార్యాలయానికి అనువుగా జాతీయ రహదారి పక్కన పాత ఎంపీపీ ఆఫీసు అందుబాటులో ఉందని తెలిపారు. అమీన్​పూర్​ వరకు వెళ్లాలంటే ఇక్కడి డివిజన్​ ప్రజలకు, వృద్ధులకు కష్టంగా మారుతుందని వివరించారు. ప్రజల సౌకర్యార్ధం, ప్రజాపాలన సౌలభ్యం కోసం డీలిమిటేషన్​లో సవరణలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అంజయ్య, కుమార్​ గౌడ్, రవీందర్​ రెడ్డి, పరమేశ్​యాదవ్, చిన్నా, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.