19న బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్..కృష్ణా, గోదావరి జలాల అంశంపై చర్చ : కేసీఆర్

19న బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్..కృష్ణా, గోదావరి జలాల అంశంపై చర్చ : కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి జలాల విష యమై చర్చించేందుకు ఈ నెల 19న తెలంగాణ భవ న్​లో బీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావే శాన్ని నిర్వహిస్తామని మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాల మూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 90 టీఎంసీల కేటాయింపులు తీసుకొస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రానికి చెప్పడం బాధాకరమని తెలిపా రు. 

45 టీఎంసీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంగీకరించడం రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని పేర్కొన్నారు. ‘‘పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నా 8 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడిన పాపాన పోలేదు. 

రైతులు, ప్రజల ప్రయోజనాలకు బీజేపీనే గండికొడుతున్నది. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే తెలంగాణ సమాజం మరోసారి ప్రత్యక్షపోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది’’అని కేసీఆర్ పేర్కొన్నారు. నదీ జలాలను ఏపీ కొల్లగొడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలమైందని తెలిపారు.