
హైదరాబాద్, వెలుగు: బీసీలను కాంగ్రెస్ సర్కా రు మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గం గుల కమలాకర్ విమర్శించారు. జీవో ద్వారా రిజర్వేషన్లు సాధ్యంకావని, రాజ్యాంగ సవరణ తోనే ఫలితం ఉంటుందని తాము ముందే చెప్పామన్నారు. కోర్టుల్లో జీవో నిలబడదనే విషయం సీఎం రేవంత్, మంత్రులు సహా అందరికీ తెలుసన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక బీసీ రిజర్వేషన్లను పెంచుతామని రేవంత్ చెప్పారన్నారు. బీసీలు ఏం చేస్తారులే అన్న నిర్లక్ష్యంతో ప్రభుత్వం చెల్లని జీవో జారీ చేసిందన్నారు.