మున్సిపాలిటీల విలీనం రాజకీయ లబ్ధి కోసమే : కేపీ వివేకానంద్

మున్సిపాలిటీల విలీనం రాజకీయ లబ్ధి కోసమే : కేపీ వివేకానంద్
  • రాష్ట్రం మొత్తాన్ని హైదరాబాద్​లో కలిపేటట్టున్నరు: కేపీ వివేకానంద్​

హైదరాబాద్, వెలుగు: రాజకీయ ప్రయోజనాల కోసమే 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేస్తున్నారని బీఆర్ఎస్​ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. ఎలాంటి అధ్యయనం చేయకుండా అశాస్త్రీయంగా విలీన నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీల విలీనంపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్​ చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు.

ప్రజాభిప్రాయం, ఎమ్మెల్యేలు, ఎంపీల అభిప్రాయం తీసుకోకుండా గ్రేటర్ లో కలపడం అన్యాయమన్నారు. విలీనం చేసిన వెంటనే పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతారన్నారు. తెలంగాణ మొత్తాన్ని హైదరాబాద్​లో కలిపేందుకు రేవంత్​ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టున్నారని విమర్శించారు. పెట్టుబడిదారుల కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని వివేకానంద ఫైర్ అయ్యారు.